Header Banner

అత‌నితో నాది ప్ర‌త్యేక బంధం.. దానికి పేరు పెట్టలేమన్న స‌మంత‌!

  Fri Apr 25, 2025 12:21        Entertainment

సినీ హీరోయిన్ సమంత తాజాగా కోలీవుడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 'గోల్డెన్ క్వీన్' పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్, వ్యక్తిగత బంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో తనకున్న అనుబంధం గురించి ఆమె భావోద్వేగంగా మాట్లాడారు. తనకు ఆరోగ్యం బాగాలేని క్లిష్ట సమయంలో రాహుల్ రవీంద్రన్ అండగా నిలిచాడని సమంత తెలిపారు. "ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటూ రాహుల్ నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. మా బంధానికి ఓ పేరు పెట్టలేను. స్నేహితుడా, సోదరుడా, కుటుంబ సభ్యుడా అనేది చెప్పలేను" అంటూ రాహుల్‌పై తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచారు. అభిమానుల మద్దతు తన అదృష్టమని, తన కష్టం, లక్ వల్లే ఇంత ఆదరణ లభిస్తోందని ఆమె పేర్కొన్నారు. కెరీర్ గురించి మాట్లాడుతూ, "మనం తీసుకునే ఒక్క నిర్ణయాన్ని బట్టి కెరీర్ ఎలా ఉంటుందో చెప్పలేం.

 

ఇది కూడా చదవండి: మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

తెలిసీ, తెలియక తీసుకునే ఎన్నో నిర్ణయాలు మన ప్రయాణంపై ప్రభావం చూపుతాయి" అని సమంత అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న దర్శకురాలు సుధ కొంగర సమంతపై ప్రశంసలు కురిపించారు. తాను సమంతకు పెద్ద అభిమానినని, గత ఐదేళ్లుగా ఆమెను దగ్గర నుంచి చూస్తున్నానని తెలిపారు. ఆమె కష్టాలు చూసి కన్నీళ్లు వచ్చేవని, ఎంతోమంది అమ్మాయిలకు సమంత స్ఫూర్తి అని అన్నారు. "సమంతతో సినిమా తీయాలని రెండుసార్లు ప్రయత్నించినా కుదరలేదు. కానీ ఎప్పటికైనా ఆమెతో కచ్చితంగా సినిమా తీస్తాను. ఆమె నటించిన 'ఊ అంటావా..' పాట నాకెంతో ఇష్టం" అని సుధ కొంగర చెప్పారు. దీనికి సమంత స్పందిస్తూ, తనకు యాక్షన్ సినిమా చేయాలని ఉందని తెలిపారు. తప్పకుండా యాక్షన్ సినిమా చేద్దామని సుధ కొంగర బదులిచ్చారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

 

విశాఖలో వైసీపీకి ఊహించని షాక్! ఒకవైపు అరెస్టుల కలకలం... మరోవైపు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై!

 

ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్! రాబోయే మూడు రోజులు ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన కుండపోత వర్షం!

 

 

అంతా ఒక్కటయ్యారు! ఓకే బ్యారక్ లో ముగ్గురు కీలక నిందితులు!

 

వైసీపీ కి మరో షాక్.. ఆ కేసులో కీలక పరిణామం! మాజీ మంత్రి అనుచరుడు అరెస్టు!

 

ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

 

ఆంజనేయులు కోరికను తిరస్కరించిన అధికారులు.. జైలు నిబంధనల ప్రకారం..

 

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్! ఆ జిల్లాలో ఘోర పరాజయం..

 

ప్రభుత్వం కీలక నిర్ణయం! అంగన్వాడి టీచర్ల భర్తీకి కొత్త రూల్స్! ఇకనుండి అది తప్పనిసరి!

 

హైకోర్టు సీరియస్ వార్నింగ్! ఇకపై లక్ష రూపాయల జరిమానా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Samantha #Tollywood #SecondMarriage